చలి లేదా వర్షాకాలాల్లో ప్రతిఒక్కరు హాట్’గా వుండే పదార్థాలను సేవించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. చలి వాతావరణానికి తగ్గట్టుగా వేడిగా వుండే పదార్థాలను తీసుకోవడంలో వుండే మజాయే వేరుగా వుంటుంది. అయితే రోజువారీ వంటకాలు కాకుండా రుచిగా ప్రత్యేకమైన వాటిని చేసుకుంటే ఆ వాతావరణాన్ని హ్యాపీగా ఆస్వాదించుకోవచ్చు.
చాలామంది చలి వాతావరణాల్లో రకరకాల సూప్’లను తీసుకోవడంలోనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అయితే టమోటా-తులసీ మిశ్రమంతో కూడిన సూప్’ను చేసుకుంటే.. రుచితోబాటు ఆరోగ్యానికి మంచిది కూడా! ఎందుకంటే.. ఈ రెండింటిలోనూ పోషక విలువలు పుష్కలంగా వుంటాయి కాబట్టి.. అవి శరీరంలోని అవయవాలను ఉత్తేజపరిచి చురుగ్గా వుండేందుకు సహకరిస్తాయి. మరి.. ఈ సూప్’ను ఎలా చేస్తారో తెలుసుకుందామా...