- Step 1
బియ్యం, పప్పు కడిగి వేరుగా, మెంతులు వేసి 4 గంటలు నాన పెట్టి తరువాత మెత్తగా రుబ్బాలి
- Step 2
మరునాడు జీరా, ఉప్పు వేసి కలిపిన పిండిలో ఒక స్పూన్ పెరుగు కలిపాలి.
- Step 3
ఈ లోపల పనీర్ ని తురిమి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పచ్చి మిర్చి తరుగు కలిసిన పనీర్ మిశ్రమమును తయారు చేసుకోవాలి
- Step 4
పెనం వేడి చేసి రుబ్బిన మినప్పిండిని గరిటతో చేసి, పలుచగారుద్ది, కాల్చి దోస మధ్యలో పనీర్ మసాలను రెండు టీ స్పూన్లు వేయాలి
- Step 5
దీనిని ట్రయాంగిల్ గా మడత వేసి పైన వెన్న వేసి ఎర్రగా కాలనిచ్చి.. సర్వ్ చేయాలి
- Step 6
కొబ్బరి లేదా అల్లం చట్నీతో ఇది చాలా బాగుంటుంది