- Step 1
బియ్యం, పప్పు, మెంతులు కడిగి.. 4 గం.లు నాన పెట్టి, కలిపి మెత్తగా రుబ్బడానికి ముందు మరమరాలు కూడ కడిగి వేసి రుబ్బాలి.
- Step 2
6 గంటల తరువాత దోసె వేయాలి.
- Step 3
నూనె బాండీలో వేడి చేసి ఆవాలు, జీరా, మినపప్పు, కరివేపాకు తాళింపుచేసి, జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, 2 కప్పుల నీళ్లు , ఉప్పు వేసి మరిగించాలి.
- Step 4
రవ్వ మెల్లిగా ఎత్తిపోస్తూ గరిటతో కలుపుతూ మంట తగ్గించి ఉడికించాలి.
- Step 5
తరువాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఉప్మా పై మూత పెట్టి ఉంచాలి. ఉప్మా రెడీ గా ఉంటుంది.
- Step 6
పెనం వేడి చేసి దోసె పిండి గరిటతో వేసి, పలుచగా రుద్ది కాల్చి దాని పై నెయ్యి, ఒక గరిటెడు ఉప్మా పెట్టి దోసె మడతవేసి తీయాలి.