- Step 1
మటన్ కడిగి ముక్కలుగా కొట్టి పెట్టాలి.
- Step 2
గసాలు, బాదం పప్పు వేయించి, పేస్ట్ అంటే ముద్ద నూరి ఉంచాలి.
- Step 3
దాల్చినీ, లవంగాలు, ఇలాచీ, మిరియాలు, బొప్పాయి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, మెంతులు అన్నీ ముద్దనూరి పెట్టాలి
- Step 4
మటన్‌ను కొంచెం రోటిలో దంచి ఒక గిన్నెలోకి తీసి దానిలో నూరిన అన్ని మసాలా ముద్దలను వేసి కలిపాలి
- Step 5
గసాలు, బాదం నూరిన ముద్దను కూడ కలిపి, 1గం. నానబెట్టాలి
- Step 6
నెయ్యి బాండీలో వేడి చేసి పసుపు వేసి మటన్ ముక్కలు మసాల అన్నీ వేసి కొంచెం వేయించి.. 2 కప్పు నీళ్ళు పోసి కుక్కర్ లో ఉడికించి 15ని తరువాత తీసి సర్వ్ చేయవచ్చు.