- Step 1
మటన్ ను క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కొట్టించి, కాలీప్లవర్ ను కూడ వేడినీటిలో కడిగి క్లీన్ చేసి పువ్వులను విడతీసి పెట్టుకోవాలి
- Step 2
అల్లం నూరి ఉంచి, భాండీలో నూనె వేడి చేసి ఉల్లితరుగు వేసి బ్రౌన్ గా వేయించి, మటన్ ముక్కల్ని, పసుపు, ధనియాలపొడి, అల్లం ముద్దను కలిపి సన్నని సెగ పై వేయించాలి
- Step 3
టమాటో ముక్కల్ని, బీట్ చేసిన పెరుగును కలిపి ఉడికించి, కాలీప్లవర్ పూలు, ఉప్పు, కారం వేసి నిదానంగా ఉడికించి నీరు తగ్గిన తరువాత నూనె తేలుతుంది. అప్పుడు డిష్లో పెట్టి సర్వీ చేస్తే చపాతీలోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది..