- Step 1
పెసరపప్పు కడిగి 3గం.లు నానబెట్టి, నీరు వేయకుండ మెత్తగా రుబ్బి ఉంచాలి.
- Step 2
ఒక డిష్ లో గుడ్లు రసం బాగా బీట్ చేసినది పోసి, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉప్పు, కారం, జీర, అన్ని వేయాలి
- Step 3
దీనికి రుబ్బిన పెసరపప్పు ముద్దను కలిపి, నాన్ స్టిక్ పెనం వేడి చేసి దానిపై నూనె వేసి, ఒక గరిటెడు పెసర పిండి, గుడ్లు మిశ్రమమును కలిపి పెనం పై వేసి పలుచగా రుద్ది కాల్చాలి.
- Step 4
పెసరట్టు బాగా పొంగి కాలిన తరువాత రెండో వైపు తిప్పి నూనె వేసి కాల్చి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత, తీసి ప్లేట్ లో సర్వ్ చేస్తే బాగుంటుంది.