- Step 1
గోధుమ పిండి, ఉప్పు, జీరా, బేకింగ్ పౌడర్, కావలసిన నీళ్లు వేసుకుని పిండి తడిసి ముద్దచేసి ఉంచాలి. తడి బట్ట కప్పి ఉంచాలి.
- Step 2
చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరచేతిలో గుండ్రంగా చేసుకుని పిండిని వేరే చేతితో కొద్దిగా వత్తి ఉంచాలి.
- Step 3
పెనం వేడిచేసి ఈ చేతితో పత్తిన ఉండలను వేడి చేసి నూనె చేయకుండా రెండు వైపుల కాల్చి గట్టిగా అయిన తర్వాత తీయాలి
- Step 4
ఈ కాల్చినవి ట్రేలో పెట్టి ఓవెన్ లో అరగంట బేక్ చేయాలి
- Step 5
అవి పగిలి బేక్ అయి ఉంటాయి. బ్రౌన్ రంగులో వస్తాయి.
- Step 6
నెయ్యికాని, కరిగిన వెన్న కాని ఒక బౌల్ లో పెట్టి కాలిని ఉండలను కొంచెం చేతితో వత్తి నేతిలో వేసి ఉంచాలి.
- Step 7
ఇవి వేడిగా కూర లేదా దాల్ తో తింటే చాలా బాగున్నాయి.
- Step 8
బ్రెడ్ మాదిరిగా బాగుంటాయి. ఇవి చాలా బలమైన ఆహారము, పిడకల పొయ్యిలో చేస్తే ఇంకా రుచిగా ఉంటాయి.