- Step 1
గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి కొంచెం కలిపి నీళ్ళు పోసి పిండి బాగా మెత్తగా నలిపి ముద్దచేసి మూత పెట్టి ఉంచాలి.
- Step 2
అరగంట తరువాత చిన్న ఉండలుగా చేసుకుని, పూరీ సూదిరిగా పీట పై వత్తి నెయ్యి రాసి పొడి పిండి చల్లి, సగం మడత వేసి దాని పై నెయ్యి పొడి పిండి చల్లి, పరోటా ఇంకా సగం మడత వస్తే పొడుపుగా వస్తుంది.
- Step 3
పరోటాను రోల్ మాదిరిగా చేసి ఆ పొడువుగా ఉన్న పరోటా పిండిని చుట్టి చేతిలో పెట్టుకుని ఆ రోల్ ని ఇంకొక చేతిలో వత్తాలి.
- Step 4
అపుడు పెనం వేడి చేసి పరోటా కాల్చి నెయ్యి రాసి, రెండో వైపు తిరగి వేసి, మళ్ళీ కాల్చి, నెయ్యి లేదా వెన్న రాసి వత్తుతూ తిప్పుతూ ఉంటే పాలతో ఎదో బొంగి చాలా బాగా వస్తుంది.
- Step 5
ఏ కూరతో అయినా పరోటా చాలా రుచిగా ఉంటుంది.