ప్రతిఒక్క వంటకంలో వేసే ఉల్లిపాయలు.. కేవలం ఆ వంటకానికి రుచి ఇవ్వడమే కాకుండా మానవ శరీరానికి ఆంటీ-బయోటిక్’గా పనిచేస్తాయి. అలాగే కొన్ని శరీరంలో శక్తిని పెంచే కొన్ని పోషక విలువలు కూడా వుంటాయి. అటువంటి ఉల్లిపాయల్ని తరుచూ ఆహారంలోనే కాకుండా నేరుగా మరేదైనా రెసిపీ లేదా సూప్ చేసుకుని తీసుకుంటే.. మరింత ఆరోగ్యంగా మెలగవచ్చు.
అయితే ఇందులో సూప్ అయితేనే చాలా మంచిది. ఇందులో వున్న ఆరోగ్య విలువలు తెలుసుకుని విదేశాల్లో ప్రత్యేకంగా సూప్’లను తయారుచేసుకుని మరీ తీసుకుంటున్నారు. అందులో ఫ్రెంచ్ ఆనియన్ రిసిపీ అయితే ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇది తీసుకుంటే.. మాంచి రుచితోబాటు ఆరోగ్యంగా వుండొచ్చు. మరి ఆ రిసిపీని ఎలా చేస్తారో తెలుసుకుందామా...