- Step 1
బాండీలో నూనె కొంచెం వేడిచేసి, నువ్వులు, పల్లీలు, జీరా వేయించి తీసి మిక్సీలో వేసి పొడి చేయాలి
- Step 2
దానిలో ఉప్పు, కారం, గరమ్ మసాలపొడి, చింతపండు చిక్కటిరసం, పంచదార, అల్లం, వెల్లుల్లి పేస్ట్ (ఇష్టపడేవారు లేదా వేయకున్నా పరవా లేదు) అన్ని మసాలలు కలిపి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
- Step 3
బీరకాయలను తొక్కతీసి గుత్తులుగా కట్ చేసుకుని, వాటిలో మసాల పెట్టి అన్నిటిని ప్లేట్ లో పెట్టుకోవాలి
- Step 4
ఉల్లిపాయలు కడిగి పొర తీసి అలాగే పాయలుగాఉంచుకోవాలి
- Step 5
బాండీలో నూనె వేడిచేసి, జీరా , ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించి, మూత పెట్టి పసుపు పొడి వేసి ఉడికించాలి
- Step 6
కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిన తరువాత బీరకాయ గుత్తులను వేసి మూత పెట్టి చిన్న మంటలో ఉడికించాలి.
- Step 7
మధ్యమధ్యలో కుదుపుతూ కూర మగ్గనివ్వాలి. మసాలా గుత్తులలో పెట్టినా మిగిలితే దానిని కూర పైన జల్లి ఉడికించవచ్చును.
- Step 8
కూర బాగా మగ్గి నూనె పైకి తేలిన తరువాత డిష్ లో తీసి కొత్తిమీర తరుగు ఇష్టపడేవారు వేసుకుని సర్వ్ చేసుకోవాలి
- Step 9
ఇది చపాతీలోకి పూరీలోకి, రైస్ లోకి చాలా రుచిగా ఉంటుంది.