- Step 1
పుచ్చులు లేకుండా బెండ కాయలు చూసి కడిగి తుడిచి పొడవుముక్కలుగా కట్ చేసి ఉంచాలి
- Step 2
పెరుగు చిలికి నీరు కొంచెం వేసి ఉంచాలి. ధనియాలు, శనగ పప్ప, కంది పప్ప, జీరా కొన్ని నీళ్ళు వేసి కడిగి నానబెట్టి ఉంచాలి.
- Step 3
అరగంట నానిన తరువాత అల్లం, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి, నానబెట్టిన మిశ్రమమును కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి
- Step 4
మజ్జిగలో ఈ రుబ్బిన మిశ్రమమును కలిపి ఉంచుకోవాలి
- Step 5
బాండీలో నూనె వేడిచేసి తాలింపు వేసి, కరివేపాకు , ఇంగువ వేసి బెండకాయముక్కలను కూడా వేసి ఉడికించాలి
- Step 6
కొంచెం నీరు వేసి పసుపు వేసి, మజ్జిగ కలిపిన మిశ్రమమును బెండకాయలో పోసి, ఉప్పు వేసి మరిగించి తాలింపు పెట్టి కొత్తిమీర జల్లాలి.