- Step 1
ఒక నాన్’స్టిక్ పాత్రను తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిరెబ్బలు వేసి 5 నిముషాలపాటు ఉడికించాలి.
- Step 2
ఉల్లిపాయలు బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేడిచేసిన అనంతరం అందులో కెప్, రెడ్ చిల్లీ సాస్ వేసి.. నూనె పైకి తేలేవరకు ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత సోయాసాస్, వెనగర్ వేసి కలుపుకోవాలి.
- Step 3
అనంతరం అందులోనే రెండు టీ స్పూన్ల కార్న్ స్టార్చ్, 4 టీ స్పూన్ల నీల్లు వేసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ ఐదు నిముషాలవరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఈ సాస్’ను పక్కన పెట్టుకోవాలి.
- Step 4
మరోవైపు ఒక పాత్రలో మైదా, కార్న్ స్టార్చ్, బ్లాక్ పెప్పర్, రుచికి తగినంత ఉప్పు, నీళ్లు వేసి.. ఉండలు లేకుండా పిండిని తయారుచేసుకోవాలి. ఈ పిండిలోనే కాలీఫ్లవర్ తరుగును వేసి కలుపుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఒక పెనుము తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు కలుపుకున్న పండిఫ్లవర్ మిశ్రమాన్ని వేసి.. డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
- Step 6
డీప్ ఫ్రై చేస్తుండగానే అందులో సాస్’ను యాడ్ చేసి మిక్స్ చేయాలి. తర్వాత మీడియం మంట మీద కొద్దిసేపటివరకు హీట్ చేయాలి. అసలు తేమ అనేది లేకుండా ఫ్రై చేసిన అనంతరం బయటికి తీసేయాలి. అంతే గోబి మంచూరియన్ రెడీ!