- Step 1
గోధుమ పిండిని బేసిన్ లో వేసి సరిపడ నీళ్ళు వేసి, చిటికెడు ఉప్పువేసి నెయ్యి రెండు స్పూన్లు వేసి పిండిని పూరీల పిండి మాదిరిగా
తడిపి ఉంచాలి.
- Step 2
మరో పాత్రలో పంచదార పొడి, యాలకుల పొడి కలిపి ఉంచుకోవాలి
- Step 3
బాండీలో నూనె వేడి చేసి, తడిపిన పిండిని, చిన్న చిన్న ఉండలుగ చేసుకుని వాటిని పూరీలుగా కాకుండా అప్పడాల మాదిరిగా చేసుకోవాలి
- Step 4
వీటిని నూనెలో వేయించుకుని, వెంటనే వాటిపై పంచదార కలుపుకున్న పొడిని చల్లుకోవాలి.
- Step 5
ఇలా వేడి పై జల్లితే పంచదార పొడి అప్పడాల పూరీలకు అతుక్కుని చాలా రుచిగా ఉంటాయి.
- Step 6
చల్లార్చి డబ్బాలో పెట్టుకుంటే 15 రోజులు నిలువ ఉంటాయి. అప్పడం చాలా చిన్న సైజు వుంటే బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు.