- Step 1
ఒక శుభ్రమైన పాత్రను స్టౌవ్ మీద పెట్టి.. అందులో పాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ (కేవలం రసాన్ని కాకుండా మొత్తాన్ని వేసేయాలి), చక్కెర తదితర పదార్థాలు వేసి వేడి చేయాలి. పాలు బాగా మరిగిన అనంతరం ఆ పాత్రను కిందకు దించేసి ఓ గంటసేపటివరకు చల్లార్చనివ్వాలి.
- Step 2
మరోవైపు ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన వేసి అందులో కొద్దిగా ఉప్పు కలిపి బాగా కలియబెట్టాలి. ఈ గిన్నెను చల్లని నీళ్లు వున్న గిన్నెలో వుంచితే.. కొద్దిసేపటి తర్వాత సొన చిక్కబడుతుంది.
- Step 3
ఇప్పుడు ఇదివరకు మరిగించి, చల్లార్చిన పాలల్లోనుంచి దాల్చిన చెక్క, నిమ్మచెక్కలను తీసేసి.. అందులో కోడిగుడ్ల సొనను వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌ మీద వుంచి, మీడియం మంటమీద కలుపుతూ ఉడికించాలి.
- Step 4
ఆ పాలమిశ్రమం బాగా చిక్కబడిన తర్వాత దానిని క్రిందకు దించేసి.. అందులో క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం దీన్ని కొద్దిసేపటివరకు ఫ్రిజ్’లో పెట్టేయాలి.
- Step 5
ఆ మిశ్రమం ఫ్రిజ్’లో గట్టిగా అయిన తర్వాత బయటకు తీసి రుబ్బుకోవాలి. అనంతరం మళ్లీ ఫ్రిజ్’లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఐస్’క్రీమ్, మెత్తగా, మృదువుగా తయారవుతుంది. ఇలా మూడుసార్లవరకు చేయాలి. అంతే! స్పానిష్ ఐస్’క్రీమ్ రెడీ!