- Step 1
మటన్లో కొద్దిగా నూనె, కారం, పసుపు, చిటికెడు ఉప్పు కలిపి మూత పెట్టి పక్కనుంచాలి.
- Step 2
కడాయిలో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, యాలక్కాయ, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి వేగించి అన్నీ కలిపి పేస్టు చేసుకోవాలి.
- Step 3
ఇంకో కడాయిలో నూనె వేసి మసాల పేస్టు, కారం, పసుపు, ఉప్పు, కలపాలి. నూనె పైకి తేలిన తర్వాత మటన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూతపెట్టాలి.
- Step 4
10 నిమిషాల తర్వాత అర లీటరు నీరు పోసి చిన్న మంటపై మత్తగా ఉడికించాలి. తర్వాత కొద్ది నూనెలో (దోరగా కాకుండా) వేగించిన పనీర్ను కలపాలి.
- Step 5
5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కర్రీ పరాటాతో పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.