- Step 1
బాణలిలో నాలుగు చెంచాల నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి.
- Step 2
ఇందులో అల్లం తురుము, వెల్లుల్లి పలుకులు, పచ్చిమిర్చి, మెంతి ఆకులు, తగినంత ఉప్పు వేసి సన్ననిమంట పై వేయించాలి.
- Step 3
ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చేప, గరం మసాలా కూడా చేర్చి పదినిమిషాలు వేయించాలి.
- Step 4
చివరగా మిరియాల పొడి చల్లి పొయ్యి కట్టేసి నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక కోడిగుడ్ల సొన కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు.
- Step 5
ఇప్పుడు పొయ్యిపై పెనం పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక సిద్ధంచేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని పెనం పై వేయాలి.
- Step 6
అవసరమనుకుంటే మరికాస్త నూనె చల్లి, రెండు వైపులా బంగారువర్ణంలోకి వచ్చేదాకా కాల్చాలి.