- Step 1
ఒక పాన్ వేడి చేసి అందులో వెన్న వేసి వేడెక్కనివ్వాలి.
- Step 2
అది వేడెక్కాక ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు మరియు నల్ల మిరియాలు వేయించాలి.
- Step 3
తర్వాత వీటికి తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు తగినంత ఉప్పు వేసి అన్నీ రంగు మారే వరకు వేయించాలి.
- Step 4
అన్ని రకాల పౌడర్లు వేసి, వాసన పోయేంత వరకు ఉడికించాలి. అప్పుడు నూనె పైన తేలుతుంది.
- Step 5
అప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలను వేయాలి. కొన్ని నీళ్లు కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. చాలా ఉడికిన తర్వాత మంట తగ్గించి, పైన మూత వెయ్యాలి. తర్వాత చికెన్ ముక్కలను అందులో నుండి బయటకు తీయాలి.
- Step 6
మరో ప్యాన్ లో నూనె వేడి చేసి ఉడికిన చికెన్ ముక్కలను ఫ్రై చేయాలి.
- Step 7
అంతకు ముందు చికెన్ తీసిన ప్యాన్ లో కొన్ని నీళ్లు కలుపుకుని గ్రేవీ తయారు చేసుకోవాలి. అందులో బియ్యం వేసి ఉడికించి, దానిపై క్యారట్ తురుము వేయాలి.
- Step 8
ఇప్పుడు రెడీగా ఉన్న రైస్ పై చికెన్ పీసులు, జీడిప్పులు, కొత్తమీర తురుము వేయాలి. అంతే తినడానికి చికెన్ కబ్సా సిద్ధం.