- Step 1
వెడల్పాటి పాత్రలో శుభ్రంగా పరిచిన మటన్, కారం, అల్లంవెల్లుల్లిపేస్ట్, కొద్దిగా పసుపు కలిపి పది నిమిషాలు పక్కన ఉంచాలి.
- Step 2
స్టౌ పై కుక్కర్ పెట్టి నూనె వేసి, వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- Step 3
తర్వాత పక్కన కలిపి ఉంచిన మటన్ ముక్కలను కుక్కర్లో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి.
- Step 4
తర్వాత అందులో దోసకాయ ముక్కలు, ఉప్పు, కొబ్బరిపొడి, మసాలా వేసి కుక్కర్ మూత ఫిక్స్ చేసి, పైన వెయిట్ పెట్టాలి.
- Step 5
కుక్కర్ రెండు, మూడు విజిల్స్ పూర్తిగా రావడం ఆగిపోయాక మూత తీసి కొత్తిమీర చల్లాలి. అన్నం, చపాతీ, జొన్నరొట్టెల్లోకి మటన్ దోసకాయ చాలా రుచిగా ఉంటుంది.