- Step 1
మైదా పిండిలా బొంబాయిరవ్వ, కొద్దిగా ఉప్పూ వేసుకుని నీళ్లతో చపాతీపిండిలా కలిపి నాననివ్వాలి.
- Step 2
ఇంతలో శుభ్రం చేసిన చేపముక్కలూ, సరిపడా ఉప్పూ, పసుపూ, అరచెంచా నూనె, చెంచా అల్లంవెల్లుల్లి పేస్టూ ఓ గిన్నెలో తీసుకుని కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత ముళ్లు తీసేయాలి.
- Step 3
బాణలిలో రెండుమూడు చెంచాల నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, ధనియాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలూ, పచ్చిమిర్చి తరుగూ వేసి దోరగా వేయించాలి.
- Step 4
ఇప్పుడు కరివేపాకూ, కొత్తిమీరా, ధనియాలపొడి, గరంమసాలా వేసి వేయించి కారం చల్లి దింపి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
నానిన పిండిని తీసుకుని చిన్న చపాతీలా వత్తి చేప మిశ్రమాన్ని ఉంచి సమోసాలా వచ్చేలా మడవాలి. ఇలా మిగిలిన పిండిని కూడా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి వేయించాలి. బాగా వేగాక తీసేస్తే సరిపోతుంది.