- Step 1
కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలను భ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.
- Step 2
దాంట్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కీమా, ఉప్పు, కారం, గరంమసాలా వేసి కలపాలి.
- Step 3
మైదాను కొంచెం నీళ్లతో కలిపి చపాతీలా పెద్ద సైజులో చేసుకోవాలి. కాకపోతే అవి పూర్తిగా పల్చగా ఉండాలి. వీటిని పెనం పై నూనె లేకుండా కాల్చాలి.
- Step 4
ఇప్పుడా చపాతీని నాలుగు ముక్కలుగా కట్ చేయాలి. ఆ చపాతీ ముక్కల్లో కొంచెం, కొంచెంగా కీమాను వేసి రోల్ చేయాలి.
- Step 5
రోల్ చేసేటప్పుడు చివరన నీళ్లతో అంటించి మూసేయాలి. ఇలా అన్నింటిలో స్టఫ్ చేసుకున్న తర్వాత కడాయిలో నూనెపోసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రంచీ, క్రంచీగా ఉండే కీమా కుర్కురే మీ ముందుంటుంది.