- Step 1
నువ్వులు దోరగా వేయించుకోవాలి. సెనగపప్పును నీళ్ళు పోసి నానబెట్టాలి.
- Step 2
బియ్యంపిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర,సుప్యలు, సెనగపప్పు, కారంపొడి, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన జ్యారట్ వేసి కలపాలి.
- Step 3
తగినన్ని నీళ్ళు చల్లుకుంటూ గట్టిగా తడిపి మూత పెట్టి ఉంచాలి.
- Step 4
పది నిమిషాల తర్వాత బాగా పిసికి కొంచెం పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి.
- Step 5
పాన్ లేదా మందంగా ఉంటే గిన్నెకు నూనె రాసి ఈ ముద్దను చేత్తో పల్చగా సమంగా వత్తుకోవాలి. మధ్య మధ్య వేలితో రంధ్రాలు చేసి కొద్దిగా నూనె వేయాలి. చుట్టు కూడా కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టి నిదానంగా కాల్చాలి.