- Step 1
సెనగపప్పు కడిగి నీళ్ళు పోసి 3 గంటలు నానబెట్టాలి. తర్వాత జల్లెట్లో వేసి నీరంతా పోయిన తర్వాత బరకగా రుబ్బుకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో 11/2 కప్పుల నీళ్ళు మరిగించి బియ్యంపిండి, తగినంత ఉప్పు వేసి కలిపి దింపేయాలి.
- Step 3
చల్లారిన తర్వాత అవసరమైనన్ని నీళ్ళు చిలకరిస్తూ రొట్టెలపిండిలా తడుపుకోవాలి.
- Step 4
చిన్నచిన్న ఉండల్లా చేసుకుని ఆవిరిమీద ఉడికించాలి. ఇలా అన్నీ ఉడికించి పెట్టుకోవాలి.
- Step 5
ఒక గిన్నె లేదా కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక.. సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి
పసుపు వేసి రెండు నిముషాలు వేపాలి ఇందులో పప్పు మిశ్రమం వేసి దోరగా తడి ఆరిపోయేవరకు వేపాలి.
- Step 6
తర్వాత ఉడికించిన బియ్యంపిండి ఉండలు, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి,నిదానంగా పది నిముషాలు ఉడికించి దింపేయాలి.