- Step 1
కందిపప్పు కడిగి నీళ్ళు పోసి కాస్త నూనె, పసుపు వేసి ఉడికించాలి
- Step 2
వంకాయలు ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్లలో వేయాలి.
- Step 3
గిన్నె లేదా కడాయిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు మెత్తబడే వరకు వేపాలి.
- Step 4
ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం కొద్దిగా వేపాలి. ఇందులో వంకాయ ముక్కలు వాటికి తగిన ఉప్పు వేసి మూత పెట్టాలి.
- Step 5
వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు మరికొద్దిసేపు ఉడికించాలి.
- Step 6
తర్వాత ఉడికిన పప్పు తగినంత ఉప్పు వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించి రాతిమీర వేసి దింపేయాలి. చివరగా గరంమసాలా పొడి వేస్తే బాగుంటుంది