- Step 1
శుభ్రం చేసిన చికెన్ ముక్కలను నిమ్మరసం, పెరుగు, ఉప్పు, పసుపు పట్టించి పక్కనుంచాలి.
- Step 2
ఎండుమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి.
- Step 3
నూనెలో ఉల్లి తరుగు దోరగా వేగించి,టమాటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడ్డాక మసాల పేస్టు కలపాలి.
- Step 4
ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి, రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూతపెట్టి చిన్న మంటపై మగ్గించాలి. దించేముందు మరోసారి నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లితే సరి.