- Step 1
చికెన్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు. వీటిని చిన్నముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.
- Step 2
కడాయిని బాగా వేడిచేసుకుని ముందుగా అల్లం,ఉల్లిపాయ ముక్కలని, వెల్లుల్లి రేకలని దోరగా వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేసి దానికి కొద్దిగా నీళ్లు కలిపి మూతపెట్టేయాలి.
- Step 3
అది సగం వరకు ఉడికిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా కలిపి ఉడికించుకోవాలి.
- Step 4
చికెన్, క్యాప్సికమ్ ఉడికిన తర్వాత పొయ్యి కట్టేసి, కాస్త చల్లారే సమయానికి నిమ్మరసం చల్లి మూత పెట్టేయాలి. అంతే క్యాప్సికమ్ చికెన్ సిద్ధం అవుతుంది. ఇది పుల్కాలు, రోటీలు, ఫ్రైడ్ రైసుల్లో తింటే భలే రుచిగా ఉంటుంది.