- Step 1
ఒక పాత్రలో ఐదు కప్పుల నీటిని తీసుకుని అందులో బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి, స్టౌవ్ మీద ఆ పాత్రను పెట్టి కొద్దిసేపటివరకు ఉడికించుకోవాలి. తరువాత వడకట్టి ఆ నీరును పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇలాగే మరో పాత్రలో కొద్దిగా నీరు పోసి.. అందులో నూడిల్స్ వేసి వేడి చేయాలి. కొద్దిసేపటి తర్వాత స్టౌవ్ మీద నుంచి పాత్రను దించి వడకట్టుకోవాలి. అప్పుడు ఆ వడకట్టిన నీటిని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. కాగిన తర్వాత అందులో ఇదివరకు ఉడికించిన బీన్స్, క్యారెట్ ముక్కలతోబాటు ఉల్లికాడల తరుగును వేసి వేయించాలి.
- Step 4
అలా కొద్దిసేపు వేయించిన తర్వాత అందులో కూరగాయలు ఉడికించిన నీళ్లు, అజినమోటో, మిరియాల పొడి, తగినంత ఉప్పు, సోయాసాస్, చిల్లీ సాస్ వేసి మరిగించాలి. తర్వాత ఇందులోనే నూడిల్స్ వేసి మరికొద్దిసేపటి వరకు ఉడికించుకోవాలి.
- Step 5
ఆ మొత్తం మిశ్రమం అంతా చిక్కబడేవరకు ఉడికించుకోవాలి. చివరగా అది చిక్కబడిన తర్వాత ఉల్లికాడల తరుగు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే! హెల్తీ వెజిటబుల్స్ నూడిల్స్ రెడీ!