- Step 1
ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, వేసి బాగా కలుపుకోవాలి.
- Step 3
ఇప్పుడు రెండు చిన్నచిన్న బౌల్స్ తీసుకుని ఒకదానిలో గుడ్డుసొన మరో దానిలో గోధుమ పిండి తీసుకోవాలి.
- Step 4
స్టవ్ వెలిగించి పాన్‌లో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఈ లోపు చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా గోధుమ పిండిలో అద్ది తర్వాత ఎగ్ బౌల్‌లో ముంచాలి.
- Step 5
మళ్ళీ గోధుమ పిండిలో ముంచి ఫ్రైచేసుకోవాలి.అలా అన్ని చికెన్ ముక్కల్నీ డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 6
ఇప్పుడు మరో పాన్ తీసుకుని వెన్న, సోయా సాస్, నిమ్మరసం, తేనె ఒకదాని తర్వాత ఒకటి వేసి వేడి చేసుకోవాలి.
- Step 7
అందులో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. కాస్త దగ్గర పడిన తరువాత దింపేసుకోవాలి. వీటిని చెట్నీలో నంజుకుని తింటే టేస్టీగా వుంటాయి.