- Step 1
నాలుగు కప్పుల నీళ్లలో బీన్స్, క్యారట్ ముక్కలు వేసి ఉడికించి మూడు కప్పులు అయ్యాక దింపి వడకట్టాలి.
- Step 2
కూరగాయ ముక్కలు, నీళ్లు విడివిడిగా తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నె లేదా ప్యాన్లో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి తరుగు వేయాలి.
- Step 3
అవి కొద్దిగా వేగిన తర్వాత కూరగాయలు ముక్కలు వేసి రెండు నిమిషాలు వేపి వడకట్టిన నీళ్లు పోయాలి.
- Step 4
అవి మరుగుతుండగా ఉల్లిపొరక, అజినొమొటొ, మిరియాలపొడి, ఉప్పు వేసి మరిగించాలి.
- Step 5
అరకప్పు నీళ్లలో కార్న్ఫ్లోర్ వేసి కలుపుకుని మరుగుతున్న సూప్లో పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
- Step 6
ఒక చిన్నగిన్నెలో గ్రుడ్లు కొట్టి నురగ వచ్చేలా గిలక్కొట్టాలి. సూప్లో ఒక్క పొంగు రాగానే మంట తగ్గించి గ్రుడ్డు మిశ్రమం పోసి మెల్లిగా గరిటతో తిప్పి వదిలేయాలి.
- Step 7
దానివల్ల గ్రుడ్డు ఉడికిన తర్వాత సన్నటి దారాల్లా అవుతుంది.
- Step 8
రెండు నిమిషాలు అలా ఉంచి దింపేయాలి. ఇందులో ఉడికించించి సన్నగా తరిగిన చికెన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. చికెన్ ఉడికించిన నీళ్లు కూడా సూప్లో కలిపేయాలి.