- Step 1
ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమంలో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను వేసి మ్యారినేట్ చేసి.. గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు స్టౌవ్ మీద ఒక డీప్ బాటమ్ పాత్రను పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేగించుకోవాలి.
- Step 3
ఉల్లి కలర్ మారిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి తురుము వేసి మరో రెండు నిముషాలపాటు వేయించాలి. అనంతరం చికెన్ ముక్కలను అందులో వేసి 10 నిముషాలపాటు వేయించాలి. తర్వాత మంటను తగ్గిస్తూ చికెన్ ముక్కలను వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు క్రిస్పీగా, బ్రౌన్ కలర్’లోకి మారుతాయి.
- Step 4
ఇలా చికెన్ ముక్కలను వేడి చేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, పెప్పర్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపటివరకు వేయించాలి. తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు మిక్స్ చేసి, మరో ఐదునిముషాలు వేపాలి.
- Step 5
ఈ గ్రేవీ మీద గరం మసాలా పౌడర్ వేసి, ఒక కప్పు నీళ్ళు కలుపుకొని మూత పెట్టి మరో 5నిముషాలు ఉడివేకించుకోవాలి. చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో చికెన్ జాల్ ఫ్రిజ్‌ను కూడా గార్నిష్ చేసుకోవాలి. అంతే!