- Step 1
గోధుమలు సన్నగా రవ్వలా విసురుకోవాలి. లేదా గోధుమరవ్వ బజారులో దొరికేది తెచ్చుకోవచ్చు.
- Step 2
కడాయి వేడి చేసి ఈ రవ్వను దోరగా పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.
- Step 3
గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకూ వేపాలి.
- Step 4
ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేపి 3 కప్పుల నీళ్ళు పోయాలి.
- Step 5
ఇందులో సన్నగా తరిగిన కొత్తిమిర, తగినంత ఉప్పు వేయాలి.
- Step 6
నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించిన రవ్వ కలిపి నిదానంగా ఉడికించాలి. చివర్లో మంట పూర్తిగా తగ్గించి మూత పెట్టి మగ్గనివ్వాలి.
- Step 7
తర్వాత దింపేసి ఇష్టముంటే కాస్త నెయ్యి, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇందులో టమాటా లేదా వేరే కూరగాయలు కూడా వేసి చేసుకోవచ్చు.