- Step 1
ఈ కూర తెల్ల వంకాయలతో చేస్తే బావుంటుంది. ముందుగా గిన్నె లేదా కడాయి వేడి చేసి జీలకర్ర, నువ్వులు, మెంతులు, పల్లీలు దోరగా వేయించి పెట్టుకోవాలి.
- Step 2
అందులో రెండు చెంచాల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి.
- Step 3
ముందుగా వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని వేయించిన ఉల్లిపాయలు, కొబ్బరిపొడి, పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
- Step 4
కడాయిలో మిగిలిన నూనె వేసి వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి మెత్తగా గుత్తులుగా లేదా పెద్ద ముక్కలుగా తరిగిన వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి
- Step 5
ముక్కలు కాస్త మెత్తబడ్డాక రుబ్బిన మసాలా, కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి.
- Step 6
ఉడికి నూనె తేలిన తర్వాత కొత్తిమీర వేసి దింపేయాలి.