- Step 1
పాలకూర ఆకులు కడిగి ఆరబెట్టాలి. పండుమిర్చి తొడిమలు తరగాలి లేదా ముద్దలా చేసుకోవాలి.
- Step 2
కడాయిలో రెండు చెంచాల నూనె వేడి చేసి జీలకర్ర, ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అందులోనే పాలకూర, పండుమిర్చి గింజలు, నార తీసిన చింతపండు రెక్కలు వేసి కలిపి మగ్గనివ్వాలి. పూర్తిగా మెత్తబడ్డాక దింపి చల్లార్చాలి
- Step 4
అందులోనే పాలకూర మిశ్రమం వేసి మెత్తబడ్డాక దింపి చల్లారనివ్వాలి.
- Step 5
ముందుగా జీలకర్ర, ధనియాల పొడి చేచసుకుని పాలకూర మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మెత్తగా రబ్బుకోవాలి
- Step 6
గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పటలాడాక వేసి దింపి పచ్చడిలో వేసి కలపాలి.