- Step 1
ముందుగా పీతలను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. వాటికి కాస్త పసుపు వేసి కలపాలి.
- Step 2
తర్వాత కారం, కొబ్బరి గసాల ముద్ద, అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, జీరాపొడి వేసి కలిపి అరగంట పక్కన పెట్టుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది
- Step 3
మరోపక్క బాణిలిలో నూనె పోసి వేడి చేయాలి. అందులో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి, వేగాక టమాట ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
- Step 4
ఇప్పుడు మసాలాతో ఊరిన పీతముక్కలు వేసి కలిపి, నిముషం వేగనిచ్చి తగినన్ని నీళ్ళుపోసి దగ్గరగా ఉడకనివ్వాలి.
- Step 5
కూర చిక్కగా (నీరు తగ్గిన తరువాత) ఉడికిన తరువాత కొత్తిమిర వేసి స్టవ్ ఆపాలి.