- Step 1
మార్కెట్ కు వెళ్లి మేక కాళ్లు తీసుకురావాలి. వీటిని అక్కడే బొగ్గుల పై బాగా కాల్పించాలి
- Step 2
తర్వాత శుభ్రమైన నీటితో రెండు సార్లు కడగాలి. మరోసారి ఉప్పు వేసి కడగాలి. తర్వాత వీటికి పసుపు రుద్ది కడగాలి.
- Step 3
అంతకంటే ముందు కొబ్బరి, గసాలు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి
- Step 4
కుక్కర్ తీసుకుని అందులో నీళ్లు పోసి.. మేకకాళ్లు, అల్లవెల్లుల్లి ముద్ద, కారం వేసుకోవాలి
- Step 5
అందులోనే పుదీనా, కొత్తిమీర, పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి
- Step 6
మరోవైపు బాణిలిలో నూనె వేడి చేసి యాలకులు, లవంగాలు, దాల్చినిచెక్క, ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించాలి
- Step 7
వాటికి అంతకుముందు సిద్ధం చేసుకున్న కొబ్బరిగసాల ముద్దను కలుపుకోవాలి. అలాగే కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా వేయించుకోవాలి.
- Step 8
తరువాత అందులో ఉడికించిన కాళ్ళను నీళ్లతో సహా వేసి కలిపి అరగంట పాటు సన్నని మంట మీద ఉడికించాలి.
- Step 9
పోట్లీ మసాలాని ఒక సన్నని వస్త్రంలో వేసి మూట కట్టి మరుగుతున్న సూప్లో వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి మూటను తీసి వేయాలి. అంతే ఘుమ ఘుమ లాడే పాయా కర్రీ రెడీ.