- Step 1
ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
- Step 2
ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేయించిన తర్వాత అందులో పులావ్ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి.. బంగారం వర్ణం వచ్చేదాకా ఉడికించాలి.
- Step 3
తర్వాత కోడిగుడ్లు, కారం, పసుపు వేసి.. గుడ్లు రంగు మారేంతవరకు వేడి చేయాలి. అనంతరం అందులో బియ్యాన్ని, కొద్దిగా నీళ్లు పోసి.. మూడు నిముషాలవరకు వేడి చేయాలి.
- Step 4
ఇప్పుడు అందులో తగినంత కారం, ఉప్పు, గరంమసాలా పొడి వేసి కలియబెట్టి.. ఆ పాత్రకు మూడపెట్టి మీడియం మంటమీద వేడిచేయాలి.
- Step 5
అందులో వున్న నీరంతా ఇరిగిపోయి అన్నం తయారయ్యాక.. కొత్తిమీర తురుము చల్లి దించేయాలి. అంతే! వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ!