- Step 1
గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాన్లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి.
- Step 2
తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తరవాత తడి పోయాక కొత్తిమీర వేసి దింపేయాలి.
- Step 3
పిండి బాగా మెత్తగా అయ్యాక చిన్న ఉండలుగా చేసుకుని పలుచగా చపాతి సైజులో ఒత్తుకోవాలి.
- Step 4
పెనం వేడి చేసి ఈ చపాతీని రెండువైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
చల్లారిన తరవాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి.
- Step 6
ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి. మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి.
- Step 7
వేడినూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి. అంతే హైదరాబాద్ సమోసా రెడీ