- Step 1
క్యాప్సికమ్ ను ఇష్టపడే వారు ఖచ్చితంగా ఈ వంటకాన్ని ఇష్టపడతారు. గ్రిల్ చికెన్, గ్రిల్ లివర్ గురించి విని ఉంటారు. ఇప్పుడు గ్రిల్ క్యాప్సికమ్ తయారీకి సిద్ధం కండి
- Step 2
ముందుగా పెద్ద సైజులో, తాజాగా ఉండే క్యాప్సికమ్ లను ఇందు కోసం సిద్ధం చేసుకోండి. వాటిని మంచి నీటితో కడిగి, శుభ్రంగా తుడిచి పెట్టండి.
- Step 3
పైన నూనె రాసి, గ్యాస్ మంట మీద నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి
- Step 4
ఇప్పుడు వీటిని ఓ గిన్నెలో వేసి క్లింగ్ ఫిల్మ్(ఆహారపదార్థాలను కప్పి ఉంచే ప్లాస్టిక్ కాగితం)తో ఆ గిన్నెను కప్పేసి పదినిమిషాలు అలాగే ఉంచాలి.
- Step 5
తరవాత అందులోనుంచి క్యాప్సికమ్‌లను బయటకు తీసి నల్లగా కాలిన పొరను కత్తి సహాయంతో తీసేయాలి. గింజలు కూడా తీసేసి క్యాప్సికమ్‌ను ముక్కలుగా కోయాలి.
- Step 6
మరోపక్క టొమాటోలను గుజ్జులా చేయాలి.
- Step 7
నాన్‌స్టిక్ పాన్ తీసుకుని నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి.
- Step 8
తరవాత అల్లంవెల్లుల్లి, కారం, దనియాలపొడి వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు టొమాటో గుజ్జు, ఉప్పు వేసి నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించాలి. తరవాత క్యాప్సికమ్ ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి.
- Step 9
చిన్న బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చితో తాలింపు చేసి గ్రేవీలో కలపాలి. చివరగా గరంమసాలా కూడా చల్లి దించాలి.