- Step 1
చికెన్ వింగ్స్ చివరలను కొద్దిగా కట్ చేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్, తేనె, సోయాసాస్, క్రీమ్ షెర్రీలను కలపాలి.
- Step 3
దీన్ని ఒక బేకింగ్ పాన్‌లో పెట్టి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
- Step 4
టెట్లీ టీ పొడిని నీళ్ళలో కలిపి ఈ ముక్కల మీద చిలకరించుకోవాలి. ఈ ముక్కలను ఒక సీకుకు కుచ్చాలి.
- Step 5
ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఈ సీకులను వాటి మీద ఉంచి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద అరగంట పాటు ఉడికించాలి.
- Step 6
ఆ తర్వాత మూత తీసి మరికాసేపు వేగనివ్వాలి. ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు అలాగే ఉంచాలి.
- Step 7
ఆ తర్వాత 450డిగ్రీల వద్ద ఓవెన్‌లో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. చివరగా నువ్వులను పై నుంచి చల్లుకొని సర్వ్ చేయాలి. నోరూరించే టీ స్మోక్డ్ చికెన్ వింగ్స్ మీ ముందుంటాయి.