- Step 1
ముందుగా బాణలి తీసుకుని అందులో వెన్న పోసి వేడి చేయాలి. వెన్న కాగిన తర్వాత అందులో పాలు, కార్న్’ఫ్లోర్ కలిపి మరిగించుకోవాలి. అవి మరుగుతుండగానే ఉప్పు, మిరియాలపొడి చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని వేయించిన తర్వాత క్రిందకు దించి పక్కన పెట్టుకోవాలి. (ఈ మిశ్రమాన్ని ‘‘వైట్’సాస్’’ అంటారు)
- Step 2
ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో కూరగాయలన్నింటిని చిన్న ముక్కలుగా తరిగి.. నీరు పోసి ఉడికించుకోవాలి. బాగా ఉడికించిన తర్వాత క్రిందికు దించేసి.. అందులో వున్న మొత్తం నీటిని వార్చి వుంచాలి. వీటిని వైట్’సాస్’తో కలిపి, మీడియం మంట మీద ఉడికించి, చల్లార్చి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
మరో పాత్ర తీసుకుని అందులో అన్నం, మైదాపిండిని వేసి మెత్తటి ముద్దగా చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి, కాస్తంత నీరు చేర్చ ముద్దలా మార్చుకోవాలి.
- Step 4
ఇప్పుడు అరటి ఆకును తీసుకుని దానిపై కొద్దిగా నూనె రాసి.. మైదా ముద్దను కొద్దిగా తీసి ఆ ఆకుపై వెడల్పుగా వత్తి, మధ్యలో వైట్’సాస్’లో కలిపిన కూరగాయల మిశ్రమాన్ని వుంచి, నిలువునా మడిచి పొడవుగా వత్తాలి.
- Step 5
ఇలా మొత్తం పండి అయిపోయేంతవరకు చేసుకున్న తర్వాత వాటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా కాల్చుకుని తీసేయాలి. అంతే! రైస్ క్రొకెట్స్ రెడీ!