- Step 1
ముందుగా ఉల్లిపాయలు, పనీర్’లను విడివిడిగా సన్నగా తరగాలి.
- Step 2
ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనెతోబాటు అల్లంవెల్లుల్లి, ఉల్లిముక్కల్ని వేసి వేయించాలి. అలాగే పన్నీర్, ఉప్పు, కారం, గరంమసాలా కూడా వేసి 5 నిముషాలు వేయించి, దించి పక్కన పెట్టేయాలి.
- Step 3
బ్రెడ్ ముక్కల అంచులు తీసేసీ, త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి. విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యంపిండి, తగిన నీళ్లు పోసి.. గట్టి పేస్టులా చేసి పన్నీర్ ముక్కల మిశ్రమంలో కలపాలి.
- Step 4
కత్తిరించిన ఓ బ్రెడ్ ముక్కను తీసుకుని దానిమీద ఈ మిశ్రమాన్ని పలుచగా పూని పైన మరో బ్రెడ్ ముక్క పెట్టి శాండ్’విచ్’లా తయారుచేయాలి. ఇలా మొత్తం బ్రెడ్ ముక్కలని చేసుకోవాలి.
- Step 5
స్టౌవ్ మీద బాణలి పెట్టి నూనె కాగిన తర్వాత బ్రెడ్ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే! పనీర్ బ్రెడ్ రెడీ!